గీత గోవిందం @50కోట్లు

విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ వసూళ్లలో అదరగొడుతోంది. స్వాత్రంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన గీత గోవిందం తొలి ఆటతోనే హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. తొలి వారంలో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.53.7 కోట్ల గ్రాస్, రూ.31.65 కోట్ల షేర్ రాబట్టింది. రూ. 15కోట్లకు అమ్ముడుపోయిన ఈ సినిమా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ లాభాలని తీసుకొస్తోంది.

ఓవర్సీస్‌లోనూ విజయ్ సత్తా చాటుతున్నాడు. గీత గోవిందం మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడంతోపాటు.. ఈ ఏడాది విదేశాల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు చిత్రాల జాబితాలో ఐదోస్థానానికి చేరుకుంది. పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడులోనూ గీత గోవిందం మంచి వసూళ్లని రాబడుతోంది. కర్ణాటకలోనూ ఈ సినిమా రూ.5 కోట్ల గ్రాస్ రాబట్టింది.