అలా.. నానిని సైడ్ చేసిన విజయ్ !

‘గీత గోవిందం’తో విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయిపోయాడు. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవినే తెలిపారు. చిరు చెప్పాక ఇక తిరుగుండదు. విజయ్ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయినట్టే. అదే సమయంలో విజయ్ నేచురల్ స్టార్ నానికి ప్రత్యామ్నాయంగా చెప్పుకొంటున్నారు. చాలా సింపుల్ కథని సూపర్ హిట్ చేయగల సత్తా నానిది. ఆయన నటన, కామెడీ టైమింగ్ ని ఫ్యామిలీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంటారు. నేను లోకల్, ఎంసిఏ సినిమాల కథలు చాలా సింపుల్. అయినా.. ఆ సినిమాలని నాని తన భూజాలపైన వేసుకొని నడిపించారు.

ఇప్పుడు గీత గోవిందంతో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ సూపర్భ్. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులని బుట్టలో వేసుకొన్న విజయ్ నానికి ఆప్షన్ గా మారాడని ఇండస్ట్రీలో చెప్పుకొంటున్నారు. ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. గీత గోవిందంలో నాని కనిపించాల్సి ఉంది. హీరోయిన్ నిత్యామీనన్ ఎంట్రీ ఇచ్చిన గెస్ట్ రోల్ లో ముందుగా నానినే అనుకొన్నారట.

ఐతే, నానికి బదులుగా నిత్యామీనన్ తో గెస్ట్ రోల్ ఇప్పిస్తే బాగుంటుందని విజయ్ సలహా ఇచ్చారట. దీంతో.. నాని కి బదులుగా నిత్యని తీసుకొన్నారు. అది బాగా వర్కవుట్ అయ్యింది. సినిమాలో నిత్యామీనన్ తో విజయ్ తన ప్రేమకథని చెప్పడం ఆకట్టుకొంది. అలా.. నానిని గీతకు దూరం చేశాడు విజయ్ దేవరకొండ. అన్నట్టు.. వీరిద్దరు ఎవడే సుబ్రమణ్యం సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.