ఇక ఏటీఎంలో ఎనీటైం అలా చేయడం కుదరదట
ఏటిఎంలలో నగదు నింపడం ఎప్పుడు పడితే అప్పుడు కుదరదని హోం మంత్రిత్వశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి కొత్త రూల్స్ వచ్చేశాయి. ఫిబ్రవరి 8 నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఫిబ్రవరి తరువాత ఇక నగరాల్లో రాత్రి 9దాటిన తరువాత ఏటిఎంలలో నగదును నింపొద్దని, గ్రామాలలో అయితే సాయంత్రం 6దాటకూడదంటూ కొత్త నిబంధనలు చెబుతున్నాయి. ఇక నక్సల్స్ ప్రభావితప్రాంతాల్లో అయితే ఏటీఎంలలో సాయంత్రం 4గంటలవరకే నగదును నింపాల్సి ఉంటుంది. ఇలా ప్రాంతాలవారీగా కొత్త నిబంధనలను తీసుకు వచ్చింది కేంద్రప్రభుత్వం. నగదును రవాణా చేసే వాహనాలు, నగదు ఉన్న ఖజానాలపై దాడులతోపాటు ఎటిఎం మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ నూతన నిబంధనలను అమల్లోకి తీసుకు వస్తోందట.