ప్రియాంక-నిక్’ల పెళ్లి చేసేది వాళ్లే.. !
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంటని అభిమానులు ముద్దుగా ‘విరుష్క’ అని పిలుచుకొంటారు. గత యేడాది ‘విరుష్క’ల వివాహం ఘనంగా జరిగింది. ఇక, ఈ యేడాది ‘నిక్యాంక’ వివాహం అదే రేంజ్ లో జరగబోతుంది. ఇక్కడ నిక్యాంక అంటే ప్రియాంక, నిక్ లు. అభిమానులు వీరిద్దరి జంటకు ‘నిక్యాంక’ అనే పేరు పెట్టేశారు.
ముంబయికి చెందిన ‘షాదీ స్వ్కాడ్’ అనే వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థకు చెందిన వెడ్డింగ్ ప్లానర్లు ‘నిక్యాంక’ వివాహం జరిపించనున్నారు. ఈ విషయాన్ని వారు సోషల్మీడియా ద్వారా వెల్లడించారు. విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ వివాహానికి వెడ్డింగ్ ప్లానర్లుగా వ్యవహరించింది వీరే కావడం విశేషం. దీంతో విరుష్క పెళ్లితో నిక్యాంక పెళ్లికి లింకు ఉందని చెప్పుకొంటున్నారు.