అఫిషీయల్ : రజనీ హీరోయిన్ త్రిష

ఎట్టకేలకు సీనియర్ హీరోయిన్ త్రిష కోరిక తీరనుంది. టాలీవుడ్, కోలీవుడ్ లోనూ స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడింది త్రిష. ఒక్క రజనీతో జతకట్టాలన్న త్రిష కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ కోరిక తీరబోతున్నట్టు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రజనీకాంత్ సినిమాలో త్రిషని హీరోయిన్ గా తీసుకోనున్నారని చెప్పుకొన్నారు.

ఇప్పుడా ప్రచారం నిజమైంది. రజనీ సినిమా కోసం త్రిషని తీసుకొన్నారు. ఈ విషయాన్ని త్రిష ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘కొన్నిసార్లు నిద్ర లేచిన తర్వాత కూడా ఇంకా కలలోనే ఉన్నామనిపిస్తుంది’ అని ట్వీట్‌ చేసింది త్రిష. ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.