బెల్లకొండకు ముగ్గురు.. అవసరమా ?

బోలేడు ఆశలు పెట్టుకొన్న ‘సాక్ష్యం’ బెల్లకొండకు హిట్ ఇవ్వలేదు. రూ. 40కోట్ల ‘సాక్ష్యం’ రూ.30కోట్ల నష్టాలని మిగిల్చింది. దీంతో ఇకపై భారీ బడ్జెట్ సినిమాలు చేయకూడనే నిర్ణయానికి ఈ యంగ్ హీరో వచ్చారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బెల్లకొండ సినిమాకు కాస్ట్ కటింగ్ విధించారు. దాదాపు 30 శాతం బడ్జెట్ ని తగ్గించే ప్రయత్నంలో ఉన్నారనే ప్రచారం జరిగింది.

ఈ సినిమా కోసం హీరోయిన్ గా కాజల్ తీసుకొన్నారు. ఆ తర్వాత ఓ కీలక పాత్ర కోసం ‘ఆర్ఎక్స్100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ని తీసుకొన్నారు. తాజాగా, మరో హీరోయిన్ గా మెహ్రీన్ ని తీసుకొన్నారు. ఇప్పటికే ఆమె షూటింగ్ లో జాయిన్ అయింది. అసలు సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కనిపించబోతున్నారా.. ? లేదంటే ముందుగా అనుకొన్న పాయల్ స్థానంలో మెహ్రీన్ ని తీసుకొన్నారా.. ? అన్నది తెలియాల్సి ఉంది.

ముగ్గురు హీరోయిన్స్ అంటే బెల్లకొండ మరోసారి సాహాసం చేసినట్టే. కాజల్, పాయల్, మెహ్రీన్ ముగ్గురు మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్స్ నే. భారీ రేంజ్ లోనే రెమ్యూనరేషన్ తీసుకొంటారు. అసలే భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న బెల్లకొండ వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు చిన్న బడ్జెట్ తో పెద్ద విజయాన్ని నమోదు చేసి కథని ఎంచుకోవాలి. కానీ, ముగ్గురు హీరోయిన్స్ రొమాన్స్ చేస్తూ.. బడ్జెట్ తడిసి మోడీ చేసుకోవడం.. అవసరమా ?