బిగ్ బాస్ హోస్ట్’గా విజయ్ దేవరకొండ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన తెలుగు బిగ్ బాస్ సీజన్ – 1 సూపర్ హిట్టయ్యింది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా సీజన్ 2 ప్రస్తారమవుతున్న సంగతి తెలిసిందే. సీజన్ 1 రేంజ్ లో కాకున్నా.. బాగానే ఆకట్టుకుంటోంది. ఇక, సీజన్ – 3 కోసం హోస్ట్ గా ఎవరిని తీసుకోబోతున్నారు ? అనే విషయంపై అప్పుడే చర్చ మొదలైంది. ఆ అవకాశం యంగ్ హీరో విజయ్ దేవరకొండకు దక్కే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

ఐతే, అంతకంటే ముందే విజయ్ బిగ్ బాస్ హోస్ట్ గా మారారు. ఆదివారం షోకి దర్శకుడు పరశురామ్ తో కలిసి విజయ్ హాజరయ్యారు. మిగతా అతిథుల్లాగా విజయ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లలేదు. నాని ప్రక్కనే కూర్చొని.. కొద్దిసేపు హోస్ట్ గా మారారు. దీప్తి సునైనాకు సీక్రెట్ టాస్క్ ఇచ్చి.. నానా హంగామా చేయించారు. అది మంచి వినోదాన్ని పంచింది. బిగ్ బాస్ వేదికగా గీత గోవిందం హిట్ చేసిన అభిమానులకు కృతజ్ఝతలు తెలిపారు విజయ్.

ఇక, ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి దీప్తి సునైనా ఎలిమినేట్ అయ్యింది. ఆమెని ఇంటి నుంచి బయటికి పంపించే సమయంలో హౌస్ లో ఎమోషన్ మూడు కొనసాగింది. తనీష్ బాగానే ఏడ్చేశాడు. మిగితా ఆదివారాలతో పోలిస్తే.. ఈ ఆదివారం షో కొత్తగా అనిపించింది. రొటీన్ కు భిన్నంగా ప్లాన్ చేశారు. వచ్చింది విజయ్ దేవరకొండ.. అందుకు అలా చేసి ఉంటారేమో.. !