నవీన్ మిట్టల్ ఒక మిలీనియం బ్రోకర్…
తెలంగాణ కాలేజీ, స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉపాధ్యాయ, లెక్చరర్ల బదిలీల్లో అనేక అవకతవకలు జరిగాయని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఈ విషయంపై సీఎంకు లేఖ రాస్తే తాము ఆరోపణలు చేసిన నవీన్ మిట్టల్ తమపై దుమ్మెత్తిపోస్తున్నారని ఆయన అన్నారు. మిట్టల్ అనే వ్యక్తి వేల కోట్ల అవినీతికి ఆద్యుడు అని ఆరోపణలు వస్తే ఎలాంటి చర్యలు లేవని ఆయన విమర్శించారు. నవీన్ మిట్టల్ ఒక మిలీనియం బ్రోకర్ అని, అవినీతిపరుడని ఆయన తరువాత వచ్చిన కలెక్టర్ గుల్జార్ స్వయం చెప్పారని శ్రావణ్ గుర్తు చేశారు.
ఓడి పాలిసీ ఉంటే జెనరల్ కౌన్సెలింగ్ లో ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఆన్ డ్యూటీ లో 120 మందిని పంపానుననడంలోనే మతలబు ఉందని, ఇంకా ఓడీలకు పంపుతామంటే ఓపెన్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని ఆయన అన్నారు. వెబ్ కౌన్సెలింగ్ లో ఇచ్చిన తరువాత ఎందుకు పోస్టింగ్స్ మార్చారో చెప్పాలన్నారు. వరంగల్ వ్యక్తి ని మహబూబ్ నగర్ కు ఓడీకి పంపి. సిద్దిపేట నుండి ఓడీలో వరంగల్ ఎలా పంపుతారని ఆయన ప్రశ్నించారు. తాను చేసిన ఆరోపణల పై విచారణ చెయ్యడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పాలన్నారాయన.
అడ్జెస్ట్ మెంట్ లో 50 మందికి వెబ్ కౌన్సెలింగ్ ముగిసిన తరువాత పోస్టింగ్స్ ఇచ్చారని ఒప్పుకున్నారని, ఎందుకు ఓపెన్ నోటిఫికేషన్ లో అడ్జస్ట్ మెంట్ ఇవ్వలేదని అన్నారు శ్రవణ్. దొంగలకు సద్దులు మోసే విధానం దయచేసి మానేయ్యాలని, 2019 లో అధికారం కాంగ్రెస్ దే నని, అప్పుడు ఈ అధికారుల సంగతి చెప్తామని ఆయన హెచ్చరించారు.