గోవిందుడు ‘అర్జున్ రెడ్డి’ని మించిపోయాడు.. !


‘అర్జున్ రెడ్డి’ హ్యాంగ్ ఓవర్ నుంచి టాలీవుడ్ ఇంకా బయటపడలేదు. ఆ తాలుకు గుర్తులని ఇంకా గుర్తుచేసుకొంటూనే ఉన్నాం. ఏ మాత్రం సినిమా కొత్తగా అనిపించిన అర్జున్ రెడ్డితో పోల్చి చూసుకొంటున్నాం. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఆర్ఎక్స్100’ అర్జున్ రెడ్డిని తలపించింది. ఆ రేంజ్ లోనే యూత్ కి కనెక్ట్ అయ్యింది. ఐతే, అర్జున్ రెడ్డి స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

తన రికార్డులని తానే క్రాస్ చేసుకొంటున్నట్టు ‘అర్జున్ రెడ్డి’ని మించిన కలెక్షన్స్ రాబడుతోంది విజయ్ దేవరకొండ గీత గోవిందం. అర్జున్ రెడ్డి యుఎస్ లో 1.7మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు గీత గోవిందం 1.5మిలియన్ మార్క్ ని అందుకొంది. అక్కడ కలెక్షన్స్ ఇంకా నిలకడగానే ఉన్నాయి. ఈ జోరు ఇలాగే కొనసాగితే ఒకట్రెండు రోజుల్లో అర్జున్ రెడ్డిని మించిపోయేలా ఉన్నాడు గోవిందుడు.

పరశురామ్ దర్శకత్వంలో విజయ్-రష్మిక జంటగా గీత గోవిందం తెరకెక్కింది. వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ ప్రేమకథని తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లో అదరగొడుతోంది. ఆస్ట్రేలియాలో బాలీవుడ్ సినిమాలు సత్యమేవ జయతే, గోల్డ్ సినిమాలని మించిన కలెక్షన్స్ రాబడుతోంది. గోవిందుడి హవా ఇప్పట్లో ఆగిలే మాత్రం కనిపించడం లేదు. ఈ హవలో ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయన్నది చూడాలి.