బిగ్‌బాస్‌’ని విడుదల చేసిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు బిగ్‌బాస్‌ ని విడుదల చేశాడు. ఆయన బావ, హీరో సుధీర్ బాబు తాజా చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. ఆర్‌ఎస్‌ నాయుడు దర్శకుడు. సుధీర్‌ బాబు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సుధీర్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలోని ‘బిగ్‌బాస్‌’ అనే సాంగ్ సూపర్‌స్టార్‌ మహేష్ బాబు తన ట్విటర్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు.
‘ఈ పాటని విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. సుధీర్‌బాబుకు, ‘నన్నుదోచుకుందువటే’ చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్’ అని మహేష్ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రంలో సుధీర్‌కు జోడీగా నభా నటేశ్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.