మెగాస్టార్ లేకుండానే సైరా టీజర్.. !

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు బహుమతి వచ్చేసింది. కొద్దిసేపటి క్రితమే ‘సైరా నర్సింహారెడ్డి’ టీజర్ ని విడుదల చేశారు. ఐతే, టీజర్ లాంచ్ కార్యక్రమానికి మెగాస్టార్ రాలేదు. అన్నీ పనులు రామ్ చరణ్ దగ్గరుండి చూసుకొన్నారు.

‘ఈ సినిమా నాన్నకు గిఫ్ట్ లాంటి. నాన్న కోసం వెనక ముందు చూసుకోకుండా ఖర్చు చేస్తున్నాం. లాభాలు-నష్టాలు లెక్కలేవి వేసుకోకుండా చేస్తున్నాం’ అన్నారు చరణ్.

భారీ బడ్జెట్ తో ‘సైరా’ తెరకెక్కుతోంది. చిరు సరసన నయనతార జతకట్టనుంది. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, సుదీప్‌, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మీరు.. సైరా టీజర్ ని చూసేయండీ..