కాళేశ్వరంపై పిటీషన్ కొట్టేసిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లేవంటూ హయత్ ఉద్దీన్ అనే నిర్వాసితుడు దాఖలు చేసిన పిటిషన్ ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొట్టివేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అనుమతులు లభించాయని ఎన్జీటికి తెలంగాణ తరపు న్యాయవాదులు చెప్పారు. ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు వచ్చాయని మంగళవారం విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ కి తెలిపింది. దీంతో ఏకీభవించిన ట్రిబ్యునల్ కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు లేవంటూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. అలాగే వచ్చిన అనుమతులు చెల్లవంటూ దాఖలైన మరో పిటీషన్ ను విచారిస్తామని తెలిపింది.పిటిషనర్లకు ఏమైనా అభ్యంతరాలుంటే ఆ పిటిషన్ విచారణ సందర్భంగా చెప్పాలని ఆదేశించింది