వైరల్ : యువ నటుడ్ని రేప్ చేసిన హీరోయిన్

ఇది జంబలకిడి పంబ న్యూస్. ఓ యువ నటుడ్ని హీరోయిన్ అత్యాచారం చేసిన ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు ఐదేళ్ల క్రితం జరిగిన అత్యాచార ఘటన. 2013లో హాలీవుడ్ సీనియర్ నటి ఏషియా అర్జంటో.. యువ నటుడు జిమ్మీ బెన్నెట్ పై అత్యాచారం చేసిందట. ఇప్పుడీ విషయం లీకై హాలీవుడ్ ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

హీరోయిన్ ఏషియా అర్జెంటో ఓ సినిమా షూటింగ్ అనంతరం హోటల్ గదికి వెళ్లిందట. ఆమెతో ఓ సెల్ఫీ దిగేందుకు ఆమె ఉన్న గదికి వెళ్లాడు యువ నటుడు జిమ్మీ. ఆ సమయంలో జిమ్మీపై అర్జెంటో అత్యాచారం చేసిందట. అంతేకాదు.. ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు రూ. 2.30 కోట్ల డబ్బు కూడా ఇచ్చిందట. ఇప్పుడీ న్యూస్ ఏ లీకైందో తెలీదు. కానీ.. వైరల్ గా మారింది.

ఈ షాకింగ్ న్యూస్ అర్జెంటో ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తోంది. హాలీవుడ్ హీరోయిన్లపై జరుగుతున్న లైంగిక వేధింపులకు నిరసనగా చేపట్టిన మీటూ కార్యక్రమంలో అర్జెంటో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఈ హీరోయిన్ ఓ యువ నటుడిని రేప్ చేసిందన్న న్యూస్ వెలుగులోకి రావడం పట్ల హాలీవుడ్ లో పలు రకాలుగా మాట్లాడుకొంటున్నారు.