శ్రీరెడ్డి మరో సంచలన ప్రకటన…!!
కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో పాపులర్ అయిన శ్రీరెడ్డి ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు. ‘రెడ్డి డైరీ’ పేరుతో ఆమె ఆటోబయోగ్రఫీని తమిళంలో తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు. చెన్నై ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆమె ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. శ్రీరెడ్డి జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ‘రెడ్డి డైరీ’ని రూపొందిస్తున్నామని డైరెక్టర్ అల్లావుద్దీన్ చెప్పారు. తనను మోసగించిన వారికి సంబందించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, సమయం వచ్చినపుడు వాటిని బయటపెడతాననంటూ శ్రీరెడ్డి హెచ్చరించింది. తాను నటించబోయే ‘రెడ్డి డైరీ’ చిత్రానికి సహకరించేందుకు నడిగర్ సంఘం హామీ ఇచ్చిందని, అలాగే కాస్టింగ్ కౌచ్‌పై తన ఆరోపణలను కొనసాగిస్తానని ఆమె చెప్పారు. తనను లైంగికంగా వాడుకున్న వారి వీడియో ఆధారాలన్నీ తన వద్దే ఉన్నాయని ‘రెడ్డి డైరీ’ సినిమాతో వాటిని విడుదల చేయనున్నట్లు చెప్పింది శ్రీరెడ్డి.