‘సైరా’ టీజర్ టాక్


ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 151 చిత్రం ‘సైరా నర్సింహారెడ్డి’ టీజర్ వచ్చేసింది. ముందుగా చెప్పినట్టుగానే మెగాస్టార్ బర్త్ డే కానుకగా ‘సైరా’ టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

టీజర్ లో ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించినట్టుగా చూపించారు. ‘ఈ యుద్ధం ఎవరికోసం ? మనందరి కోసం’ అనే డైలాగ్ రోమాలు నిక్కబొడిచేలా ఉంది. గుర్రంపై దూసుకొచ్చిన నర్సింహారెడ్డి ఆంగ్లేయులని ఊచకోత కోయబోతున్నట్టు ఓ బిట్ సీన్ అదిరిపోయింది. ఐతే, అంతకంటే ముందు బ్రిటీషర్లు భారతీయులని ఎలా బానిసలుగా చూపించే ఓ సీన్ ని చూపించారు

మొత్తంగా సైరా టీజర్ టీజర్ అదిరిపోయింది. ఇది మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్ కావడంతో.. మరో ఇతర పాత్రని టీజర్ లో చూపించలేదు. దాదాపు రూ. 200కోట్ల భారీ బడ్జెట్ సైరా తెరకెక్కుతోంది. చిరు సరసన నయనతార జతకట్టనుంది. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, సుదీప్‌, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మీరు.. సైరా టీజర్ ని చూసేయండీ..