డిఎంపిహెచ్ఎ (ఎం) ఫ‌లితాల వెల్ల‌డి

డిఎంపిహెచ్ఎ (ఎం) ఫ‌లితాలను తెలంగాణ పారా మెడిక‌ల్ బోర్డు విడుద‌ల చేసింది. మొత్తం 1444 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా, అందులో 339 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. 1105 మంది ఫెయిల్ అయ్యారు. 23శాతం మంది మాత్రమే ఉత్తీర్ణ‌త సాధించారు. కాగా, జిహెచ్ఎంసి ప‌రిధిలో 35 మంది సానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్లు, 50 మంది హెల్త్ అసిస్టెంట్ ల పోస్టుల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌కు స‌మ‌యం ఉంది. ఈ నేప‌థ్యంలో డిఎంపిహెచ్ఎ (ఎం) ఉత్తీర్ణ‌త పొందిన అభ్య‌ర్థులు ఈ రెండు పోస్టుల‌కు అర్హ‌త ఉంది. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి చొర‌వ‌తో పారా మెడిక‌ల్ బోర్డు విద్యార్థుల భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని డిఎంపిహెచ్ఎ(ఎం) ఫ‌లితాలు ముందుగానే విడుద‌ల చేసింది.