సైరా టీజర్ డిజిటల్ రికార్డ్

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా.. ఆయన 151వ చిత్రం ‘సైరా నర్సింహారెడ్డి’ టీజర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీజర్ అదిరిపోవడంతో.. మెగా అభిమానులు పండగ చేసుకొంటున్నారు. ఇక, టీజర్ తో రికార్డులకి తెరలేపారు మెగాస్టార్. సైరా టీజర్‌ 24 గంటల్లో 12 మిలియన్ల (కోటి ఇరవై లక్షల) వ్యూస్‌ సాధించింది. ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఇదే టాప్‌ అని చెబుతున్నారు. సైరా టీజర్ డిజిటల్ రికార్డుతో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తోంది.

గొప్ప స్వాతంత్ర పోరాట యోధుడు ‘ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి’ జీవిత కథతో తెరకెక్కుతోన్న చిత్రమ్మిది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, జగపతిబాబు.. తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం. రామ్ చరణ్ నిర్మాత. వచ్చే యేడాది వేసవిలో ‘సైరా’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.