బర్త్ డే స్పెషల్ : అన్నయ్య ఇంట్లో పవన్ ఫ్యామిలీ


మెగాస్టార్ చిరంజీవి తన 63వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి మెగాస్టార్ కు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఇక, అభిమానులకు ఓ రోజు ముందుగానే మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్ అందింది. నిన్న (మంగళవారం) ఉదయమే ‘సైరా’ టీజర్ ని విడుదల చేశారు. ఇప్పుడు మెగా అభిమానులు ఆ మైకంలోనే ఉన్నారు.

ఇండస్ట్రీ ప్రముఖులందరూ మెగాస్టార్ ని విష్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. ఒక్కటే లోటు. అదే తమ్ముడు పవర్ స్టార్ ఎక్కడబ్బా. ఇంకా అన్నయ్యని విష్ చేయలేదు. ఒక్క ట్విట్.. మేసేజ్ ఏమీ లేవు అనుకొంటున్నారు మెగా అభిమానులు. ఇంతలో పవన్ ఫ్యామిలీతో పాటు అన్నయ్య చిరంజీవి ఇంట్లో వాలిపోయారు. భార్య పిల్లలతో కలిసి అన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలని మెగా కోడలు ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.