‘సైరా’ టీజర్ పై పవన్ ఏమన్నాడో తెలుసా ?

మెగా పండగ వచ్చేసింది. మెగాస్టార్ స్టార్ పుట్టినరోజుని అభిమానులు పండగలా జరుపుకొంటున్నారు. చిరు పేరిట అన్నదానాలు, రక్తదానాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు చిరుని విష్ చేస్తున్నారు. మహేష్, ఎన్ టీఆర్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్… తదితరులు ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ కు పుట్టిరోజు శుభాకాంక్షలు తెలిపారు.

మెగాస్టార్ నుంచి అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ అందిన సంగతి తెలిసిందే. ‘సైరా నర్సింహారెడ్డి’ టీజర్ ని విడుదల చేశారు. ఆ టీజర్ ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఐతే, సైరా టీజర్ ని ముందుగా చూసింది ఎవరో తెలుసా ? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని మంగళవారం సాయత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన మెగాస్టార్ బర్త్ డే వేడుకల్లో రామ్ చరణ్ తెలిపారు.

‘నాకు సైరా టీజర్‌ ఫైనల్‌ అవుట్‌పుట్ 10.45కి వచ్చింది. వెంటనే నేను ఆ టీజర్‌ను కల్యాణ్ బాబాయ్‌కి ఫార్వర్డ్ చేశాను. 11.10కి బాబాయ్‌ దగ్గర నుంచి ‘టీజర్‌ అదిరిపోయింది. థియేటర్లో సినిమా చూసేందుకు రెడీ అవుతున్నాను’ అంటూ రిప్లయ్‌ వచ్చింది’ అని అభిమానులకు చెప్పారు చరణ్‌. ఈ మాటలతో వేదిక మారుమ్రోగిపోయింది.