అజిత్ ‘విశ్వాసం’ ఫస్ట్ లుక్

అజిత్-శివ లది సూపర్ హిట్ కాంబో. వీరి కలయికలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయి. వీరమ్, వేదాళం, వివేగం దేనికదే సూపర్ డూపర్ హిట్. వీరి కలయికలో నాలుగో సినిమాగా ‘విశ్వాసం’ తెరకెక్కుతోన్న సంగతితెలిసిందే.

తాజాగా, ‘విశ్వాసం’ ఫస్ట్ లుక్ ని విడుదల చేసించి చిత్రబృందం. ఇందులో అజిత్ పోలీస్ పాత్ర లో కనిపించనున్నాడు. పోస్టర్ లో ఇద్దరు అజిత్ లని చూపించడం చూస్తుంటే.. ఆయన రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఆ రెండు పాత్రలు కూడా మాస్ లుక్ లోనే కనిపించడం విశేషం. ఐతే, వయసు తేడా చూపించేందుకు నెరసిన గెడ్డంతో ఓ పాత్రని చూపించారు.

ఈ చిత్రంలో అజిత్ సరసన నయన తార జతకట్టనుంది. వివేక్ ఒబెరాయ్, రొబోట్ శంకర్, యోగిబాబు, అంకిత.. తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందించనున్నారు. సత్యజ్యోతి ఫిల్మ్ నిర్మిస్తోంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ‘విశ్వాసం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.