విషాదం : బాలీవుడ్ డ్యాన్సర్ అభిజిత్ షిండే ఆత్మహత్య


బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకొంది. ప్రముఖ బాలీవుడ్ డ్యాన్సర్ అభిజిత్ షిండే ఆత్మహత్యకు చేసుకొన్నాడు. ముంబైలోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన బ్యాంక్ అకౌంట్ ను తన కుమార్తె పేరిట బదిలీ చేయాలని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.

ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. అభిజిత్ గత కొంతకాలంగా తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. అతను డిప్రెషన్ తో బాధపడుతున్నాడని అతని భార్య పోలీసులకి చెప్పినట్టు తెలిసింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తుని కొనసాగిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్ బీర్ కపూర్, రణ్ వీర్ సింగ్.. తదితరులతో కలిసి అభిజిత్ పనిచేశారు. ఆయన డ్యాన్సర్ గా మంచి పేరుంది. అభిజిత్ ఆత్మహత్యతో బాలీవుడ్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. పలువురు బాలీవుడ్ ప్రముఖులు అభిజిత్ కు సంతాపం తెలియజేశారు.