ముందుస్తుపై కేసీఆర్ వెనకడుగు

దేశంలో ముందస్తు ఎన్నికలపై విస్తృత చర్చకు తెరలేచిన సంగతి తెలిసిందే. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ముందస్తు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్టు వార్తలొచ్చాయ్. అంతకంటే స్వీడుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు వెళ్తున్నాం. ఈ యేడాది డిసెంబర్ లోనే ఎన్నికలు. సెప్టెంబరులో ప్రభుత్వాన్ని రద్దుచేస్తామని సంకేతాలిచ్చారు. ఆ దిశగా పార్టీ శ్రేణులని రెడీ చేశారు కూడా. ఇందులో భాగంగానే సెప్టెంబరు 2న కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన సభ పేరిట.. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం ఏం చేసిందన్న విషయాన్ని ఢంకా భజాయించి సెప్తం అన్నారు కేసీఆర్.

ఇంతలోనే ముందస్తుపై వెనకడుగు వేశారు కేసీఆర్. బుధవారం రాత్రి మంత్రులతో జరిగిన కీలక సమావేశంలో ముందస్తు లేదని స్పష్టతనిచ్చారు. సర్వేల్లో సానుకూల ఫలితాలు కనపడుతున్నాయని, ఎన్నికల్లో విజయం తమదేనని, 100 స్థానాల్లో కారు జోరు ఖాయమని ధీమా వ్యక్తం చేసింది. అలాంటప్పుడు ముందస్తుపై వెనకడుగు ఎందుకు ? అంటే అది కేంద్ర ప్రభుత్వం వ్యూహానికి దగ్గట్టుగా వ్యవహరించడమేనని చెబుతున్నారు. దీనిపైసెప్టెంబరు 2న కొంగరకలాన్‌లో నిర్వహించబోయే ప్రగతి నివేదన సభలో క్లారిటీ రానుంది.