సునీల్’ని వదిలించుకోవాలని చూస్తున్నాడు


హీరోగా కలిసిరాకపోవడంతో మళ్లీ కమెడియన్ గా రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సునీల్. ప్రస్తుతం సెట్స్ మీదున్న తారక్ ‘అరవింద సమేత’, రవితేజ ‘అమర్ అక్భర్ ఆంథోని’ సినిమాల్లో కమెడియన్ గా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో మళ్లీ కమెడియన్ బిజీ అయిపోవాలని ఆశపడుతున్నాడు సునీల్.

అంతకంటే ముందు.. అల్లరి నరేష్ తో కలిసి ‘సిల్లీ ఫెలోస్‌’లో నటిస్తున్నారు. ఇందులో సునీల్ పాత్ర హీరోకు తక్కువ, కమెడియన్ కు ఎక్కువగా ఉంటుందట. కామెడీ ఎంటర్ టైనర్స్ ని బాగా డీల్ చేసే భీమినేని శ్రీనివాస్‌ దర‍్శకత్వంలో సిల్లీ ఫెలోస్‌ తెరకెక్కుతోంది. గతంలో అల్లరోడుని ‘సుడిగాడు’గా చూపించి హిట్ కొట్టాడు భీమనేని.ఈ సినిమాలో పూర్ణ, చిత్ర శుక్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

‘సుడిగాడు’ సీక్వెల్ గా ప్రచారం జరుగుతోన్న ‘సిల్లీ ఫెలోస్’లో ఎంటర్ టైన్ మెంట్ డబుల్ అవ్వనుందట. తాజాగా, ఈ సినిమా మోషన్ పోస్టర్ ని విడుదల చేసించి చిత్రబృందం. బైప్ పై అల్లరినరేష్ వెళ్తుండగా.. ఆయన్ని పట్టుకొని వేలాడే సునీల్ పోస్టర్ ని మోషన్ పోస్టర్ గా వదిలారు. సునీల్ ని వదిలించుకోవడానికి.. అల్లరోడు ట్రై చేస్తున్నట్టు ఉంది పోస్టర్. బహుశా.. క్రిడెట్ తనకి మాత్రమే దక్కాలని కావొచ్చు.. !