పార్టీ ఏర్పాటుకు రజినీ గ్రౌండ్ వర్క్ అదుర్స్..
రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటి నుంచే పార్టీ నిర్మాణంపై పూర్తిగా దృష్టిసారించినట్లుగా కనిపిస్తోంది. ఈ విషయంలో ఆయన ఎంత సీరియస్ గా వర్క్ చేస్తున్నారనేది ఈ ఒక్క సంఘటన ఆధారంగా తేల్చి చెప్పేయొచ్చు. పార్టీ ఏర్పాటు తరువాత ముఠా రాజకీయాలు, అవకతవకలు జరిగే అవకాశం లేకుండా రజినీ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షూటింగ్ లో బిజిబిజీగా ఉన్నా సరే మక్కల్ మండ్రం కార్యకలాపాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారట. తన సిద్ధాంతాలకు, లక్ష్యాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై వేటు వేస్తున్నారు రజినీ.
పార్టీ ఏర్పాటుకు ముందే రజనీ మక్కల్ మండ్రంలో జరుగుతున్న తొలగింపులు, కొత్త నియామకాలు తమిళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోగా పార్టీని ప్రారంభిస్తానని రజినీ ప్రకటించిన నేపథ్యంలో రీసెంట్ గా రజినీ మక్కల్ మండ్రం తరపున ఒక ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు ఉప కార్ యదర్శులు, ఐటీ, యువజన విభాగం కార్యదర్శులను తొలగిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. వారితో కార్యకర్తలెవరూ సంబంధాలు పె ట్టుకోవద్దని ఆదేశించారట. ఇదే కాకుండా వివిధ జిల్లాల్లో కూడా కార్యదర్శులను తొలగించి, కొత్తవారిని నియమిస్తున్నారు. అభిమానులైనా సరే ఆ విషయంలో రజినీ కఠినంగానే వ్యవహరిస్తారట. మొ త్తంగా పార్టీ ఏర్పాటులో రజినీ గ్రౌండ్ వర్క్ అదుర్స్ అంటున్నారు అంతా.