సైరా టీజర్ @15మిలియన్ వ్యూస్

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నర్సింహారెడ్డి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన 151 సినిమా కోసం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్శింహారెడ్డి జీవిత కథని ఎంచుకొన్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా మంగళవారం ‘సైరా టీజర్’ విడుదలైంది. టీజర్ తోనే రికార్డులకి తెరలేపాడు చిరు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ సినిమా టీజర్ కు దక్కని డిజటల్ వ్యూస్ సైరా టీజర్ దక్కించుకోవడం విశేషం. 24గంటల్లో 12మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకొని టాప్ స్థానంలో నిలిచింది. ఇప్పుడా డిజిటల్ వ్యూస్ 15మిలియన్స్ కి చేరాయి.

ఈ సినిమా చిరు సరసన నయనతార జతకట్టనుంది. బిగ్ బీ అమితాబ్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, కిచ్చ సుదీప్, తమన్నా.. తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది వేసవిలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.