నిర్మాతలు విజయ్’ని వదలడం లేదట

టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ.. ‘గీత గోవిందం’తో స్టార్ హీరో అయిపోయాడు. పరశురామ్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ‘గీత గోవిందం’ బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకుంది. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లోనూ అదరగొడుతోంది. ఆస్ట్రేలియాలో బాలీవుడ్ సినిమాలని మించి కలెక్షన్స్ రాబడుతోంది.

ఈ నేపథ్యంలో ‘ఇట్స్‌ ఎ ర్యాప్‌’ అనే టాక్‌షోలో పాల్గొన్న విజయ్ దేవరకొండకు బాలీవుడ్ కు వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా ? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి విజయ్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ‘బాలీవుడ్ కు వెళ్లే విషయంపై ఇంకా ఏమీ ఆలోచించలేదు. ఒకవేళ నేను బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలన్నా అందుకు తగ్గ గట్టి పాత్ర దొరకాలి. మరోపక్క దక్షిణాదిన మా నిర్మాతలు నన్ను వదులుకోవాలని అనుకోవడం లేదు. నా నిర్మాతలు ఇతర పరిశ్రమలకు వెళ్లకుండా నన్ను కూర్చోపెట్టి బ్రెయిన్‌వాష్‌ చేస్తుంటారు” అని తెలిపారు.

ఇక, విజయ్ దేవరకొండ నటించిన మరో సినిమా ‘టాక్సీవాలా’ విడుదలకు రెడీగా ఉంది. ఐతే, ఈ సినిమా రిలీజ్ ముందే హెచ్ డీ ప్రింట్ బయటకు రావడం చిత్రబృందాన్ని కలవపెడుతోంది. ‘గీత గోవిందం’ కూడా రిలీజ్ ముందే పైరసీకి గురైంది. అయినా.. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ‘టాక్సీవాలా’ కూడా లీక్ సెంటిమెంట్ కలిసొచ్చి సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.