’96’ ట్రైలర్ టాక్


సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది త్రిష. ఇప్పుడామె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి – త్రిష జంటగా ’96’ తెరకెక్కుతోంది. ఇదో థ్రిల్లర్ ఎంటర్టైనర్. మద్రాస్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై నంద గోపాల్ నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసించి చిత్రబృందం.

ట్రైలర్ లో స్కూల్ విద్యార్థులుగా ఉండగానే త్రిష, విజయ్ సేతుపతి ప్రేమికులుగా చూపించారు. పెళ్లీడు దాటిపోయి.. కలుసుకొన్న విజయ్, త్రిషలు స్కూల్ నాటి ప్రేమకథని గుర్తు చేసుకొంటూ… ట్రైలర్ కొనసాగింది. విజయ్ సేతుపతి గెడ్డెంతో మాస్ లుక్ లో కనిపించాడు. ఈ ట్రైలర్ మీరు ఓ సారి చూసేయండీ.. !