ఆటగాళ్లు.. మొదటి ఆట టాక్ !
సీనియర్ హీరో జగతపతి బాబుని ‘పెదబాబు’గా చూపించిన దర్శకుడు మురళి. ఇప్పుడీ దర్శకుడు జగపతిబాబు, నారా రోహిత్ లని ‘ఆటగాళ్లు’గా మార్చాడు. వీరి ఆటని ఈరోజు థియేటర్స్ లోకి తీసుకొచ్చాడు. మరీ.. ఆటగాళ్లు మొదటి ఆట టాకేంటీ.. ? తెలుసుకొందాం పదండీ.. !
ఓ రైతు రోడ్ పై వెళుతుండగా జరిగిన యాక్సిడెంట్ సీన్ తో సినిమా మొదలయింది. ఆ చనిపోయిన రైతు కూతురుని రక్షించే వ్యక్తిగా నారా రోహితి ఎంట్రీ ఇచ్చాడు. నారా రోహిత్ ఒక సినిమా డైరెక్టర్. ఐతే, తన భార్య హత్య కేసులో అరెస్ట్ చేయబడ్డాడు. నిజంగానే హీరో తన భార్యని హత్య చేశాడా ? ఉత్కంఠతో సినిమా కొనసాగింది.
ఫస్టాఫ్ లో హీరో-హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఏపీసోడ్. హీరో భార్య మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలతో కథ నడించింది. జగపతి బాబు క్రిమినల్ లాయర్ గా కనిపించాడు. సుబ్బరాజు డీసీపీ గా కనిపించాడు. మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్. ఓ చిన్ని ట్విస్టుతో ఫస్టాఫ్ ముగిసింది.
సెకాంఢాఫ్ లో నారా రోహిత్, ఆయన భార్యను హత్య చేసిన వ్యక్తికి మధ్య యాక్షన్ ఏపీసోడ్. నేర పరిశోధన, ఓ ట్విస్టు, జగపతి బాబు రోహిత్ ల ఛాలెంజ్ లతో కథ ఆసక్తిగా సాగింది. సినిమాలోని సస్పెన్స్ ఎలిమెంట్ మెల్లగా రివీల్ చేస్తూ కథని ముగించాడు దర్శకుడు. నారా రోహిత్, జగపతి బాబు ల మధ్య వచ్చే సన్నివేశాలు, ట్విస్టులో సినిమాలో హైలైట్ గా నిలిచాయి. పూర్తి రివ్యూని మరికొద్దిసేపట్లో మీ ముందు ఉంచుతోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.