రివ్యూ : ఆటగాళ్లు
నారా రోహిత్ ది ప్రత్యేకమైన శైలి. ఆయన సినిమా అంటే కొత్తదనం ఉంటుందనే నమ్మకం కలిగించాడు. ఆ నమ్మకంతోనే రోహిత్ సినిమాపై ఆసక్తి చూపుతుంటారు ప్రేక్షకులు. ఆయన తాజా చిత్రం ‘ఆటగాళ్లు’పై అదే ఆసక్తి నెలకొంది. ఆ.. ఆట కూడా నారా రోహిత్, జగపతి బాబుల మధ్య అని తెలియడంతో.. అంచనాలు పెరిగిపోయాయి. టీజర్, ట్రైలర్స్ తో ఆట థ్రిల్లింగ్’గా ఉండబోతుందని అర్థమైంది. మరీ.. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఆటగాళ్లు’ ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొన్నారు ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం.. పదండీ.. !
కథ :
సిద్ధార్థ్ (నారా రోహిత్) దర్శకుడు. టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరు. అంజలి (దర్శన బానిక్) అనే మధ్య తరగతి అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకొంటాడు. వీరి సంసార జీవితం సాఫీగా సాగిపోతుంటుంది. ఇంతలో అంజలి హత్య
గురవుతుంది. అది చేసింది భర్త సిద్దార్థ్ అనే అనుమానంతో పోలీసులు.. అతడిని అరెస్టు చేస్తారు. ఈ కేసులో సిద్ధార్థ్ లాయర్ ని పెట్టుకోకపోవడంతో.. పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రముఖ క్రిమినల్ లాయర్ వీరేంద్ర (జగపతి బాబు) టేకప్ చేస్తాడు. న్యాయం ముఖ్యమంత్రినే ఎదురించే రకం వీరేంద్ర.
అలాంటిది అంజలి హత్య కేసులో అంతకుడు సిద్ధార్థ్ కాదని.. ఆయన్ని కేసు నుంచి తప్పించేస్తాడు. ఆ తర్వాత వీరేంద్రకు షాకింగ్ విషయం తెలుస్తుంది. ఈ హత్య చేసింది మున్నా కాదు.. సిద్ధార్థ్ అని తెలిసిపోతుంది. ఈ కేసు నుండి బయట పడటానికి తనను ఈ ఓ పావులా వాడుకున్నాడని తెలుసుకొంటాడు. ఆ తర్వాత సిద్ధార్థ్-వీరేంద్ర మధ్య ఎత్తులు-పైఎత్తులతో కూడిన ఆటనే ఆటగాళ్లు మిగితా కథ.. !
ఎలా ఉందంటే ?
దర్శకుడు పరచూరి మురఌ రాసుకొన్న లైన్ బాగుంది. కథలో సస్పెన్స్, ఎమోషన్స్ చూపించే స్కోప్ కూడా ఉంది. ఐతే, సస్పెన్స్ సంగతి పక్కన పెడితే… ఎమోషన్ మాత్రం వర్కవుట్ కాలేదు. సినిమాని గ్రిప్పింగ్ గా నడపడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఆ లోపాన్ని నారా రోహిత్, జగపతి బాబు తమ అద్భుతమైన నటనతో కొంత వరకు కవర్ చేయలేకపోయారు. అయినా.. కథనంలో లోటు కొట్టొచ్చినట్టు కనబడుతోంది.
ఎవరెలా చేశారంటే ?
నారా రోహిత్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రని అంగీకరించడం మెచ్చుకోదగ్గ విషయం. మంచి ప్రేమికుడిగా, భర్తగా, దర్శకుడిగా, మానవత్వం ఉన్న వ్యక్తిగా అతడి నటన ఆకట్టుకుంటుంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనూ ఆకట్టుకొన్నాడు. ఇక, జగపతి బాబు నటన ఈ సినిమాకే హైలైట్. హీరోగా, విలన్ గా ఆయనకున్న అనుభవం క్రిమినల్ లాయర్ పాత్రకి బాగా ఉపయోగపడింది. హీరోయిన్‌గా దర్శన బానిక్ ది చిన్ని పాత్రే. అయినా.. ఉన్నంతలో ఆకట్టుకొంది. సుబ్బరాజు, బ్రహ్మానందం.. తదితరులు పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా :
సాయి కార్తీక్ అందించిన సంగీతం ఓ మోస్తారుగానే ఉంది. నేపథ్య సంగీతం అంతే. ఎడిటింగ్ బాగులేదు. కత్తెర పెట్టాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. నిర్మాణ విలువలు ఫర్వాలేదు.
చివరగా : ఆటగాళ్లు.. ఆకట్టుకోలేకపోయారు
రేటింగ్ : 2.5/5