ఫస్ట్ పెగ్’కు లేటయ్యింది.. !

నాగ్-నానిల మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. టైటిల్ తగ్గట్టుగానే తప్పతాగి బెడ్ మీద పడుకొన్న నాని, నాగ్ ల పిక్ ని ఫస్ట్ లుక్ గా వదిలారు. ఇక, ట్రైలర్ రిలీజ్ డేటు ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ లోనూ హీరోలిద్దరు పెగ్గులేస్తున్నట్టు చూపించారు. ఫస్ట్ పెగ్ వేసేది రేపే అంటూ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేశారు.

ఈరోజు సాయంత్రం 5గంటలకు దేవదాసు టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఐదు దాటి అయిదున్నర అయినా.. దేవదాసు టీజర్ ఇంకా రాలేదు. దీంతో మందు బాబులు తెగ ఫీలైపోతున్నారు. ఫస్ట్ పెగ్ కు లేటయిపోతుందబ్బా.. అంటూ నాలుక కరచుకొంటున్నారు. మరో ఐదు నిమిషాల్లో .. ‘మధ్యపానం ఆరోగ్యానికి హానికరం. రా కొడితే ఆరోగ్యానికి ఇంకా హానికరం’ నాని ట్విట్ చేశాడు అనుకోండీ.. !

ఈ చిత్రంలో నాగ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో, ఆయన డాక్టర్ పాత్రలో నాని కనిపించబోతున్నారు. నాగ్ సరసన ఆకాంక్ష సింగ్, నాని సరసన రష్మిక మందన జతకట్టనున్నారు. తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచేపోయిన టైటిల్ ఇది.