తెలంగాణలో ముందస్తు ఖాయం ?
తెలంగాణలో ముందస్తు హీట్ పెంచుతోంది. గత కొన్నాళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై సమాలోచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న (గురువారం) తెలంగాణ అధికార ప్రతినిధులు ఈసీని కలిశారు. ముందస్తు ఎన్నికల నిర్వహణపై సాధ్య-అసాధ్యాలపై చర్చినట్టు సమాచారమ్. ఆ వెంటనే సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహాన్ తో భేటీ అయ్యారు. ఇక, నేడు టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. పార్లమెంటరీ, శాసనసభ పక్ష నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనూ ముందస్తుపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.
ఈ సమావేశం అనంతరం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. గడిచిన 20 రోజుల్లో సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. ముందస్తు అజెండాతోనే కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నట్టు సమాచారమ్. మరోవైపు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రం కేసీఆర్ పెండింగ్ పనులపై చర్చించడానికే ఢిల్లీ వెళ్తున్నట్టు చెబుతున్నారు. జోనల్ వ్యవస్థ, హైకోర్టు ఏర్పాటు.. తదితర అంశాలపై చర్చించనున్నట్టు చెబుతున్నారు.
ముందస్తుకు వెళ్లడం వెనక కేసీఆర్ వ్యూహాం ఉందని చెబుతున్నారు. ముందస్తుకు వెళ్లడం ద్వారా భాజాపా ప్రభుత్వంపై ప్రజలపై ఏర్పడిన వ్యతిరేకత నుంచి తప్పించుకోవచ్చు. అదే సమయంలో ముస్లిం ఓట్లని ఆకర్షించొచ్చన్నది కేసీఆర్ ప్లాన్ లా ఉంది. మొత్తానికి.. నేటి టీఆర్ ఎస్ విస్తృత స్థాయి సమావేశం, కేసీఆర్ ఢిల్లీ టూర్ పరిణామాలని బట్టీ తెలంగాణలో ముందస్తుపై దాదాపు క్లారిటీ రానుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.