‘పేపర్ బాయ్’తో మహేష్, ప్రభాస్’కు ప్రత్యేక అనుబంధం.. ఎందుకంటే ?

కొత్త కుర్రాడు సంతోష్ శోభన్ ‘పేపర్ బాయ్’గా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. రియా సుమన్ హీరోయిన్. దర్శకుడు సంపత్ నంది నిర్మాత గావ్యవహరించారు. ఐతే, ఈ చిన్ని సినిమాపై మహేష్ బాబు, ప్రభాస్ ఆసక్తిని చూపడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమా హీరో సంతోష్ శోభన్ ఎవరో కాదు.. దర్శకుడు శోభన్ తనయుడు. శోభన్ మహేష్ తో ‘బాబీ’, ప్రభాస్ తో ‘వర్షం’ సినిమాలు చేశాడు. ‘వర్షం’ ప్రభాస్ కెరీర్ లో తొలి హిట్ గా నిలిచింది. మహేష్ ‘బాబీ’ మాత్రం యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. అయినా.. ఈ ఇద్దరు స్టార్స్ కి దర్శకుడు శోభన్ అంటే ప్రత్యేక అభిమానం. ఆ అభిమానంతోనే శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘పేపర్ బాయ్’కి ఫుల్ సపోర్టుగా నిలుస్తున్నారు అన్నమాట.