జగపతికి భోజనం కూడా పెట్టించని నిర్మాత ఎవరు ?

తెలుగు తెరపై పడి లేచిన కెరటం జగపతి బాబు. యాక్షన్, ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. శోభన్ బాబు తర్వాత ఆ రేంజ్ లో ఫ్యామిలీ ప్రేక్షకులని ఆకట్టుకొన్న కథానాయకుడు. ఐతే, ‘లెజెండ్’ సినిమాకు ముందు జగపతి పరిస్థితి దారుణం. చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఏ చిన్ని పాత్ర కోసమైనా.. కాల్ వస్తుందని వెయిట్ చేసేవాడట.

అవకాశాలు లేనప్పుడు ఎదురైన పరిస్థుతులపై ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. నిర్మాతలు కనీస మర్యాద కూడా ఇచ్చేవారు కాదట. ఓ నిర్మాత షూటింగులో కుర్చీ కూడా వేయలేదుట. మరో నిర్మాత 7రోజుల పాటు భోజనం కూడా తెప్పించలేదని తెలిపాడు. ఐతే, ‘లెజెండ్’ తర్వాత ప్రభాస్ జాతకమే మారిపోయింది.

హీరో కంటే మించి విలన్ గా పేరు తెచ్చుకొన్నాడు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. లోనూ వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన చేతిలో 13 సినిమాలు ఉన్నాయట. బహుశా.. జగపతి బాబు బయోపిక్ తీస్తే.. సంజయ్ దత్ బయోపిక్ కి ఏమాత్రం తీసిపోదేమో.. !