ఆ తరువాతే కాంగ్రెస్ అభ్యర్థులను నిర్ణయిస్తాం…
టీఆర్ఎస్ ముందస్తు సంకేతాల నేపథ్యంలో కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. టీఆర్ఎస్ ది ప్రగతి నివేదన సభ కాదని, అది దోపిడీ నివేదన సభ అని ఆయన విమర్శించారు. నాలుగున్నరేళ్లలో కేసీఆర్ ఏం సాధించారని సభ పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు తాము పూర్తిగా సమాయత్తంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఏడుగంటల కేసీఆర్ కెబినెట్ మీటింగ్ వివరాలను బ్రీఫింగ్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు ఉత్తమ్.
కాంగ్రెస్ పార్టీ లోకల్ ఇష్యూస్ కు మరింత ప్రాధాన్యతనిస్తామని, స్టేట్ మేనిఫెస్టోతో పాటు, ఈసారి నియోజకవర్గానికి ఓ మేనిఫెస్టో ఇస్తామని ఆయన చెప్పారు. లోకల్ ఇష్యూస్ కు సంబంధించి మరింత పరిష్కారం కోసమే ఈ మేనిఫెస్టో విడుదల చేస్తామని ఆయన అన్నారు. ఎన్నికల్లో అభ్యర్ధులకు సంబంధించి ఆశావహ అభ్యర్థుల ఎంతమంది ఉంటే వారందరి పేర్లు సర్వేకు పంపుతామన్నారు.