క్రిష్’తో గొడవపై కంగనా స్పందన
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తో దర్శకుడు క్రిష్’కు విబేధాలు తలెత్తాయి. అందుకే క్రిష్ కంగనా ‘మణికర్ణిక’ చిత్రాన్ని మధ్యలోనే వదిలేసి వచ్చాడు అనే ప్రచారం జరుగుతోంది. అది నిజమే అన్నట్టు క్రిష్ ‘ఎన్టీఆర్’ బయోపిక్ తో బిజీ అయిపోవడం, ‘మణికర్ణిక’ వైపు చూడకపోవడం.. అనుమానాలు మరింత బలపడ్డాయి. ఐతే, తాజాగా, ఈ ప్రచారంపై కంగానా స్పందించింది. దర్శకుడు క్రిష్ తో తనకు ఎలాంటి విబేధాలు లేవని క్లారిటీ ఇచ్చింది.
‘తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ప్రతి రోజు ఇద్దరం మాట్లాడుకుంటుంటాం. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో.. ముందుగా కొన్ని రోజులు కాల్ షీట్స్ ఇవ్వమని క్రిష్ కోరాడు. ఐతే, తాను ముందు ఉన్న కొన్ని ఒప్పందాల వల్ల తా డేట్లు ఇవ్వలేకపోయా. ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే తమ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని’ తెలిపింది కంగనా.
అంతేకాదు.. ‘మణికర్ణిక’ సినిమాలో మరికొన్ని ఆసక్తికర అంశాలను తెరకెక్కించాలని రచయితలు నిర్ణయించారట. వాటికి కంగానే ఓకే చెప్పింది. ఇక, ఝాన్సీలక్ష్మీ భాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కంగనా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న విషయం తెలిసిందే.