ముందస్తుపై ముడ్నాలుగు రోజుల్లోనే.. !

ముందుస్తుపై మూడ్నాలుగు రోజుల్లోనే తెలిపోనుంది. ముందస్తు ఎన్నికల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలని కన్ఫూజన్ లో పెట్టేసిన విషయం తెలిసిందే. ముందుగా ముందస్తుకు వెళ్తున్నట్టు కేసీఆర్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. సెప్టెంబర్ లోనే అసెంబ్లీ రద్దు. డిసెంబర్ లో ఎన్నికలు జరగబోతున్నాయనే హడావుడి చేశారు. దీంతో స్వపక్షం, ప్రతిపక్ష నేతలు అలర్ట్ అయ్యారు. ఇంతలోనే కేసీఆర్ ప్లేటు ఫిరాయించారు. ముందస్తు అంటే ముందస్తు కాదు. సాధారణ ఆర్నేళ్ల ముందు జరిగే ఎన్నికలని అసలు ముందస్తు ఎన్నికలే అనరు. ఇవి సాధారణ ఎన్నికలే. కాకపోతే.. మూడ్నాలుగు నెలలు ముందు జరగబోతున్నాయనే ధోరణిలో మాట్లాడారు.

గత 20రోజుల క్రిందట ఢిల్లీ టూర్ వెళ్లొచ్చిన తర్వాత కేసీఆర్ ధోరణిలో మార్పు వచ్చింది. ముందస్తు లేదని, కేంద్రం వ్యూహాన్ని బట్టి నిర్ణయం తీసుకొద్దామని తెలిపారు. ఈ లోపు సెప్టెంబర్ 2న నిర్వహించే ప్రగతి నివేదన సభని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సభ నాటికి ముందస్తుపై ఓ క్లారిటీ ఇవ్వాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయం మంత్రి కేటీఆర్ తెలిపారు. మూడ్నాలుగు రోజుల్లో ముందస్తుపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఆదివారం కేటీఆర్ రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ వద్ద జరుగుతున్న ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్… ముందస్తుపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

అదే సమయంలో.. ప్రతి పక్షాలని గట్టిగానే ప్రశ్నించారు. అసలు ముందస్తు ఎన్నికలకు ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్న తాము అధికారాన్ని వదులుకోవడానికి సిధ్ధంగా ఉంటే ప్రతిపక్షాలు సంతోషపడాలి. కానీ, ఎందుకు భయపడుతున్నాయి ? ప్రజల ముందుకు వెళ్లడానికి ప్రతిపక్షాలకు ధైర్యం చాలడం లేదని విమర్శించారు కేటీఆర్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 100 స్థానాల్లో తెరాసను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.