బిగ్ బాస్ నుంచి నాని ఎలిమినేట్.. !?

తెలుగు బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పాలి. సీజన్-1కి హోస్ట్ గా వ్యవహరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ ని ఏ రేంజ్ కి తీసుకెళ్లి నిలబెట్టారు. ఇప్పుడు సీజన్ 2లో నాచురల్ స్టార్ నాని ఆ రేంజ్ తగ్గకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదట్లో నాని హోస్టింగ్ పై కొన్ని నెగటివ్ కామెంట్స్ వినబడ్డాయి. నానిని తప్పిస్తున్నారు. మళ్లీ తారక్ నే తీసుకొస్తున్నారనే ప్రచారమూ జరిగింది. ఆ తర్వాత నాని సెట్టయిపోయాడు. బాగా డీల్ చేస్తున్నాడని చెప్పుకొన్నారు. ఇప్పుడు సడెన్ గా బిగ్ బాస్ నుంచి నాని ఎలిమినేట్ అయ్యాడు అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇదీ నిజమే. ఈ మాట స్వయంగా నానినే చెప్పాడు. ఆదివారం బిగ్ బాస్ రాఖీ పండగ స్పెషల్ అదిరిపోయింది. నాని హౌస్ లోకి వెళ్లిపోయి సందడి చేశాడు. ఇంటి సభ్యులతో కలిసి రాఖీ పండగ జరుపుకొన్నారు. వారికి స్పెషల్ గెఫ్ట్ అందించి సంతోషపెట్టాడు. వారితో కలిసి భోజనం కూడా చేశాడు. ఇక, చివరికి పెద్దగా సస్పెన్స్ కు పోకుండా ఈ వారం పూజా ఎలిమినేట్ అయినట్టు ప్రకటించాడు. ఐతే, ఇంటి నుంచి పూజాతో కలిసి నాని కూడా బయటకు వెళ్లేటప్పుడు.. తనపై తానే జోకులు వేసుకొని ఆకట్టుకొన్నాడు నాని. ఈ వారం ఎలిమినేట్ అయ్యింది పూజ ఒక్కరే కాదు. ఇద్దరు.. పూజతో పాటు నేను హౌస్ నుంచి వెళ్లిపోతున్నాగా.. ! అంటూ పంచులేశాడు. అవి హౌస్ సభ్యులలతో పాటు, షో చూస్తున్న ప్రేక్షకులని నవ్వించారు. బహుశా.. గతంలో తనపై ట్రోల్స్ కి.. ఈ విధంగా బదులిచ్చాడేమో.. !