ఆసియా క్రీడలు : సెమీ ఫైనల్‌లో సైనా ఓటమి
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు. మహిళల సింగిల్స్‌లో భాగంగా జరిగిన తొలి సెమీఫైనల్లో సైనా…చైనా షట్లర్ తై జూయింగ్ చేతిలో 0-2 తేడాతో ఓడిపోయారు. మ్యాచ్ హోరాహోరీగా సాగింది. సైనా వీరోచితంగా పోరాడింది. ఐతే, కొన్ని అనవసర తప్పిదాల కారణంగా సైనా మ్యాచ్‌ను చేజార్చుకోవల్సి వచ్చింది.
19 నిమిషాల హోరాహోరీగా సారిగి మొదటి గేమ్‌ను సైనా 17-21తో ఓడిపోయింది. ఆ తర్వాత రెండో గేమ్‌ను ఓ దశలో 14-14తో సమం చేసింది. ఇక అక్కడి నుంచి సైనాకు ప్రత్యర్థి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వరుసగా పాయింట్లు సాధిస్తూ తైజు యింగ్ 21-14తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. దీంతో సైనాకు ఓటమి తప్పలేదు. ఫలితంగా ఈ ఆసియా క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది.
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో భారత్‌కు దక్కిన తొలి పతకం ఇది. ఆసియా క్రీడల్లో 1982 దిల్లీ క్రీడల్లో పురుషుల సింగిల్స్‌లో సయ్యద్ మోదీ కాంస్యం గెలిచాడు.