ఫ్లాప్ ఫెలోస్‌.. హిట్ కొట్టేలా ఉన్నారుగా… !!

హీరోలు అల్లరి నరేష్, సునీల్.. ఇద్దరిదీ ఒకే పరిస్థితి. వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. ఇప్పటికే వరుసగా అర డజనుకి పైగా ప్లాపులు చవిచూశారు. ఈ ఫ్లాప్ ఫెలోస్ కలిసి నటిస్తున్న చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. భీమనేని శ్రీనివాస్‌రావు దర్శకుడు. నరేష్‌, భీమనేని కాంబోలో వచ్చిన ‘సుడిగాడు’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
ఇప్పుడా మేజిక్ ని ‘సిల్లీ ఫెలోస్’ రిపీట్ చేయనున్నారనే ప్రచారమూ జరుగుతోంది.

‘సిల్లీ ఫెలోస్’ ట్రైలర్ ని చూస్తే అది నిజమే అనిపిస్తోంది మరీ.. ! రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం ఈ సినిమా ట్రైలర్‌ను తీసుకొచ్చింది చిత్రబృందం. ఈ ట్రైలర్ ని సూపర్‌స్టార్‌ మహేష్ బాబు ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. ట్రైలర్ తోనే ఫుల్లుగా నవ్వించేశారు.

అర్జున్‌ రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100 సినిమాల్లోని ముద్దు సన్నివేశాల గురించి సునీల్‌ వేసిన పంచ్‌లు హైలైట్‌గా నిలిచాయి. నరేశ్‌, హీరోయిన్‌తో కలిసి ఫైటింగ్‌ చేస్తూ..‘మణిగంధం బహిర్ముఖం’ అంటూ ‘బాహుబలి’ డైలాగ్‌ చెప్పడం, ఇందుకు పోసాని కృష్ణమురళి ‘సారీ మిస్టర్‌ రాజమౌళి’ అనడం ఆకట్టుకుంటోంది. మొత్తంగా సిల్లీ ఫెలోస్ ట్రైలర్ అదిరిపోయింది. ఫ్లాప్ ఫెలోస్ నరేష్, సునీల్ కు ‘సిల్లీ ఫెలోస్’ హిట్ ఇచ్చేలా ఉంది.

ఇక, హీరోగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న సునీల్.. కమెడియన్ గా రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్-తారక్’ల ‘అరవింద సమేత’తో పాటు, రవితేజ ‘అమర్ అక్భర్ ఆంటోని’ సినిమాలోనూ సునీల్ కమెడియన్ గా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు విడుదలైతే.. సునీల్ మళ్లీ కమెడియన్ గా బిజీ అయిపోతాడని చెప్పుకొంటున్నారు. మరోవైపు, అల్లరి నరేష్ కూడా మహేష్ ‘మహర్షి’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.