మన కంటే ఈ ఏనుగు బెటర్ : అక్షయ్
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సోమవారం ఓ పుటేజ్ ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పుటేజ్ లో ఓ ఎనుగు ఇంటి దగ్గరకు వస్తుంది. ఏదైనా బీభత్సం సృష్టిస్తుందేమో అనుకొంటే.. ఓ విలువైన మెసేజ్ ని ఇచ్చి ఆశ్చర్య పరిచింది. ఇంటి ఆవరణలో ఉన్న డస్ట్ బిన్ ని చూసి.. ఆ పక్కన పడివున్న చెత్తని తీసి అందులో వేస్తుంది. దీనిపై అక్షయ్ ఆశ్చర్యాన్నివ్యక్తం చేశారు. ఇది రియల్ పుటేజ్ నా.. ? ఎడిటింగ్ చేసిందా.. ?? అన్న అక్షయ్ మనలో చాలామంది కంటే ఈ ఏనుగు బెటర్ అంటూ కామెంట్ ఇప్పుడు పుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే అక్షయ్ ట్విట్ రీ-ట్వీట్ చేసింది.
ఇక, విభిన్నమైన సినిమాలతో అక్షయ్ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్న సంగతి తెలిసిందే. స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల అక్షయ్ ‘గోల్డ్’ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక, పూజా హెగ్డే టాలీవుడ్ లో హహ చూపిస్తోంది. ప్రభాస్ సాహో, ఎన్ టీఆర్ ‘అరవింద సమేత’సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇదీగాక, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చరణ్-తారక్ ల మల్టీస్టారర్ కోసం పూజా హెగ్డేని పరిశీలిస్తున్నట్టు సమాచారమ్.
Incredible! Elephants seem to be doing our jobs
it’s time we take a leaf out of this kind animal’s book
#kindestanimals https://t.co/w7hKD32nru
— Pooja Hegde (@hegdepooja) August 28, 2018