ఇకపై చూపించదట.. !


పెదవులని జుర్రుకోవడంలో స్పెషలిస్టు అనిపించుకుంది హీరోయిన్ ఆండ్రియా. సంగీత దర్శకుడు అనిరుధ్ తో ఆండ్రియా పెదవులు కలిపిన సీన్ ఇప్పటికీ.. ఎప్పటికీ గుర్తుండిపోయేది. సినిమాల్లోనూ గ్లామర్ గా కనిపించి.. కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేసేది. అలాంటి ఈ హాట్ బ్యూటీ షాకింగ్ నిర్ణయం తీసుకొంది. ఇకపై చూపించేది లేదు. గ్లామర్ పాత్రల చేయనని స్టేట్ మెంట్ ఇచ్చేసింది.

లిప్‌లాక్‌ సన్నివేశాలు, పొగ తాగే సన్నివేశాలు ఇక చేయబోను. కొత్తగా తనను సంప్రదించే దర్శకులు.. తన షరతులకు అంగీకరిస్తే మాత్రమే నటిస్తానంటునని తేల్చి చెబుతోంది. ఇటీవల విడుదలైన విశ్వరూపం- 2లో ఆమె యాక్షన్‌ పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇకపై నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేయాలని ఆడ్రియా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. ఆండ్రియా అందాలని అమితంగా ఇష్టపడే ప్రేక్షకులకి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.