సైరా సెట్’లో బాలయ్య సందడి

మెగాస్టార్ చిరంజీవికి షాక్ ఇచ్చారు బాలయ్య. సడెన్ గా ‘సైరా’ సెట్ లో ప్రత్యక్షమయ్యాడట. కాసేపు చిరుతో కలిసి ముచ్చటించారు. చిత్రబృందాన్ని అభినందించి.. సినిమా బాగా రావాలని ఆకాంక్షించినట్టు తెలిసింది. ఐతే, దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు రాలేదు. ఇంతకు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సైరా సెట్స్ లో సందడి చేశారు. ఆ ఫోటోలు చాలా ఆలస్యంగా సోమవారం చిత్రబృందం బయటకు వదిలిన సంగతి తెలిసిందే.

బిగ్ బీ అమితాబ్, చిరంజీవి, రామ్ చరణ్ లతో కలిసి పవన్ దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే సమయంలో సైరా సెట్ లో బాలయ్య సందడి చేసిన ఫోటోలు కూడా బయటకు వస్తే బాగుణ్ను అంటున్నారు నందమూరి అభిమానులు. ఇక, ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన గెడ్డెం లుక్ లో రాజ గురువుగా కనిపిస్తున్నారు.

గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రైతు’ సినిమా చేయాలని బాలయ్య ఆసక్తి చూపారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం స్వయంగా బాలయ్య ముంబై వెళ్లి అమితాబ్ ని కలిశారు కూడా. ఐతే, బిగ్ బీ కి డేట్స్ కుదరకపోవడంతో.. ఈ సినిమా సెట్స్ మీదకు రాలేకపోయింది. అమితాబ్ ఒప్పుకుంటేనే ఈ సినిమా చేస్తానని బాలయ్య ఓ సందర్భంలో తెలిపారు.