సీఎం కేసీఆర్ తో బీజేపీ నేతల భేటీ.. ఎందుకంటే?

ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో బీజేపీ నేత‌ల భేటీ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. సీఎం ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌రువాత బీజేపీ నేత‌లు ముఖ్య‌మంత్రిని క‌ల‌వ‌డంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఓ రేంజ్ లో చ‌ర్చ జ‌రుగుతోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేసీఆర్ తో బీజేపీ నేత‌ల భేటీపై ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. గంట‌కు పైగా జ‌రిగిన ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రరావు ఉన్నారు. అనంత‌రం మంత్రి కేటీఆర్ కూడా ఈ భేటీకి హాజ‌ర‌య్యారు. బీజేపీ నేత‌ల‌కు సీఎం ఢిల్లీ టూర్ విశేషాల‌ను వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది.

మాజీ ప్రధాని వాజపేయి స్మారక చిహ్నం కోసం ఒక ఎకరా స్థలం, విగ్రహ ఏర్పాటు పై సీఎం తో చర్చించామ‌ని, ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని బీజేపీ నేత‌లు తెలిపారు. రాజకీయ చర్చలేమి త‌మ‌ మధ్య రాలేదని, మూడు సార్లు ప్రధానిగా చేసి అందరి మన్ననలు పొందిన వాజపేయికి హైదరాబాద్ తో ఎంతో అనుబంధం ఉందని ఈ విష‌యంపైనే సీఎంతో చ‌ర్చించామ‌ని బీజేపీ నేత‌లు తెలిపారు.

.