కేసీఆర్ ఆరాటం అందుకోసమే..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇటు బిజెపి , అటు ఎంఐఎం రెండూ కావాలని కాంగ్రెస్ నేత భట్టివిక్రమార్క అన్నారు. కాకపోతే ఇద్దరితో ఒకేసారి ఉంటె మునిగిపోతాననే భయం కేసీఆర్ దని ఆయన తెలిపారు. కేసీఆర్ ముసుగు జారిపోతుందనే ముందస్తు అంటున్నారని, ఎంత తొందరగా ఎన్నికలు వస్తే ప్రతిపక్షాలకు అంత మంచిదని ఆయన చెప్పారు. కలిసి వచ్చినా, విడివిడిగా ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమని , గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ తో దోస్తికోసమే కేసీఆర్ ఆరాటమని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపికను సెలెక్షన్ కమిటీ చూసుకుంటుందని, అభ్యర్థుల గెలుపు అవకాశాల పై సర్వే లు ఫలితాలు కూడా కీలకమేనని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో నీళ్లు రాలే , ఉద్యోగాలు రాలే కానీ నిధులు మాత్రం ఖాళీ అయ్యాయని ఎద్దేవా చేశారు.