విజయ్ దేవరకొండ.. వంద కోట్ల హీరో !

‘గీత గోవిందం’ విజయ్ దేవరకొండని స్టార్ హీరోని చేసేసింది. ఈ సినిమాతో విజయ్ టాలీవుడ్ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడని స్వయంగా మెగాస్టార్ చిరంజీవినే చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రం విజయ్ ని వందకోట్ల హీరోని చేసింది. ‘గీత గోవిందం’ రూ. 100కోట్ల గ్రాస్ ని రాబట్టింది. యుఎస్ లో 2మిలియన్ మార్క్ ని దాటేసింది. అక్కడ ఈ యేడాది 2 మిలియన్ మార్క్ అందుకొన్న తెలుగు సినిమాల సరసన ‘గీత గోవిందం’ చేరిపోయింది.

ఈ యేడాది రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి, అజ్ఞాతవాసి చిత్రాలు యుఎస్ లో 2మిలియన్ మార్క్ ని అందుకొన్నాయి. ఇప్పుడు ‘గీత గోవిదం’ ఈ లిస్టులో చేరిపోయింది. ఈ సినిమా విజయ్ ని స్టార్ హీరో చేయడమే గాక.. వంద కోట్ల హీరోని చేసింది. డబుల్ ధమాఖా అంటే ఇదేనేమో.. ! పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ కి జంటగా రష్మిక మందన నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు.