మాది ‘ముంద‌స్తు’ స‌భ కాదు… ఎన్నిక‌లెప్పుడొస్తాయో తెలియ‌దు!

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిఆర్ ఎస్ సిద్ధంగా ఉంద‌ని, సీఎం చెప్పినట్టు 100స్థానాలు గెలుస్తామ‌ని మంత్రి కేటీర్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనే విష‌యం త‌మ‌కు తెలియ‌ద‌ని ఆయ‌న అన్నారు. శాసనసభ రద్దు అంశం క్యాబినెట్ పరిధిలో ఉంటుందని, .అంతే కాని పార్లమెంట్ స‌భ్యుల‌కు,శాసనసభ్యులకు సంబంధం లేదని చెప్పారు కేటీఆర్. వాళ్ళు ఎవరయినా మాట్లాడితే అది వారి వ్యక్తిగత విషయమ‌ని, పార్టీ కి సంబంధం లేద‌ని చెప్పారాయ‌న‌.

ఇది ఎన్నికల కోసం జరుగుతున్న సభ కాదని, ప్రతి ఏటా పార్టీ ప్లీనరీ సమయం లో నిర్వహించే సభకు చెందినదే త‌ప్ప ఇది ముందస్తు సభ కాదన్నారు మంత్రి. త‌మ‌కు ఎలాంటి సెంటిమెంట్లు లేవని, ప్రజలకు ప్రగతిని వివరించేందుకు సభ పెడుతున్నామ‌ని చెప్పారు. భారత ప్రధాని గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మోడీ గారిని కలిశారని, .దానిని కూడా రాజకీయ కోణం లో చూడద్దన్నారాయ‌న‌.

తాను ఢిల్లీ లో ఎన్నికల కమిషన్ ను కలవలేదని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో 16ఎంపీ సీట్లు తాము గెలుస్తామ‌ని, 17వ సిటు గురించి తాను మాట్లాడనని ఆయ‌న అన్నారు. చేరికలు ఇంకా ఆగలేదని వ‌చ్చే నెలలో చాలా మంది కాంగ్రెస్ నుండి నాయకులు వస్తారని కేటీఆర్ చెప్పారు. మళ్ళీ ప్రభుత్వం త‌మ‌దేన‌ని,కేసీఆర్ గారే సీఎం అని ధీమా వ్య‌క్తం చేసారాయ‌న‌