వ‌రవరరావు అరెస్ట్…

విరసం నేత వ‌ర‌వ‌ర‌రావు ఇంట్లో ఉద‌యం నుంచి సోదాలు కొన‌సాగించిన పోలీసులు ఆయ‌న్ను అరెస్టు చేశారు. ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట 40 నిమిషాల పూణే పోలీసుల సోదాలు నిర్వ‌హించి వ‌ర‌వ‌ర‌రావును విచారించారు. సోదాలు జరుగుతున్న సమయంలో వరవరరావు ఇంటికి చేరుకున్న ప్ర‌జా సంఘాలు, బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మ‌ధ్యాహ్నం 1.40నిమిషాల‌కు వ‌ర‌వ‌రావును పోలీసులు అరెస్టు చేసి వైద్య ప‌రీక్ష‌ల నిమిత్త గాందీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం నాంప‌ల్లి కోర్టులో హాజ‌రు ప‌రిచారు.