‘గీత గోవిందం’ రాఘవేంద్ర రావు కథ.. !?

‘గీత గోవిందం’పై కాపీ మరక పడింది. ఈ సినిమా కథ నాదే అంటున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు. పరశురామ్ దర్శకత్వంలో విజయ్-రష్మిక జంటగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘గీత గోవిందం’ కలెక్షన్స్ లో అదరగొడుతోంది. ఏకంగా వందకోట్ల క్లబ్ లో చేరిపోయింది. యుఎస్ లో 2మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. అంతకుమించి ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు.. ఈ సినిమా కథ నాదే. తాను తెరకెక్కించిన ‘పెళ్లి సందడి’ సినిమాను కాపీ కొట్టి పరశురామ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చమత్కరించారు.

‘20 ఏళ్ల క్రితం నేను, అల్లు అరవింద్‌ ‘పెళ్లి సందడి’ సినిమాను తెరకెక్కించాం. ‘గీత గోవిందం’ సినిమా చూశాక నాకు ‘పెళ్లి సందడి’ రోజులు గుర్తుకు వచ్చాయి. ఒక్క ముద్దు సన్నివేశం లేకుండా సినిమాను తెరకెక్కించడం ఈరోజుల్లో అసంభవం. నిర్మాతల నుంచి ఎంతో ఒత్తిడి ఎదురవుతుంటుంది. ఏ విషయంలోనూ రాజీపడకుండా పరశురామ్‌ ఇంత చక్కటి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినందుకు అతనికి శుభాకాంక్షలు’ అన్నారు దర్శకేంద్రుడు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత గీత గోవీందంతో ఆ రేంజ్ హిట్ అందుకొన్నాడు విజయ్ దేవరకొండ. ఈ సీమాతో స్టార్ హీరో అనిపించుకోవడంతో పాటు.. వంద కోట్ల హీరో అయ్యాడు.