చైతు-సమంత ‘యుద్ధం’ ఫిక్స్


భర్త నాగ చైతన్యతో సమంత యుద్ధానికి రెడీ అయింది. సమంత ఇష్టపడి మరీ.. చేసిన చిత్రం ‘యు-టర్న్’. కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ ‘యూ టర్న్’కు రిమేక్ ఇది. తెలుగు రిమేక్ కు మాతృక దర్శకుడు పవన్ కుమార్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 13న ‘యు టర్న్’ ప్రేక్షకుల ముందుకు రావాలని భావించారు. ఐతే, ఆగస్టు 31కి ప్రేక్షకుల ముందుకు రావాల్సిన నాగ చైతన్య ‘శైలాజారెడ్డి అల్లుడు’ కేరళ వరదల ఎఫెక్ట్ తో సెప్టెంబర్ 13కి వాయిదా పడింది.

ఈ నేపథ్యంలో సమంత ‘యూ టర్న్’ సినిమా విడుదలపై సందిగ్ధత ఏర్పడింది. ఈ సినిమా వాయిదాపడేలా ఉందనే ప్రచారం జరిగింది. అది నిజమేనన్నట్టు త్వరలో ‘యు టర్న్’ విడుదల తేదిన ప్రకటిస్తామని సామ్ ట్విట్ చేసింది. దీంతో భర్త కోసం సామ్ తన సినిమాని వాయిదా వేసుకొంటుందని చెప్పుకొన్నారు. ఐతే, సామ్ ఏమాత్రం తగ్గలేదు. భర్తపై యుద్ధం ప్రకటించింది. ‘యు టర్న్’ని సెప్టెంబర్ 13నే విడుదల చేస్తున్నట్టు సామ్ ట్విట్ చేసింది.

సమంత నటించిన తమిళ చిత్రం ‘సీమరాజా’ కూడా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘యు టర్న్‌’ ఒక హత్య నేపథ్యంతో తెరకెక్కిన చిత్రమిది. ‘సీమరాజా గ్రామీణ’ నేపథ్యంతో సాగే చిత్రం. ఈ రెండు చిత్రాలను ఒకేసారి ప్రేక్షకులు ముందుకు రావడం హాట్ టాపిక్ గా మారింది. దీనికితోడు అదే రోజు చైతూ ‘ శైలాజారెడ్డి అల్లుడు’ రానున్నండటం బాక్సాఫీసు యుద్ధం మరింత రసవత్తంగా మారింది.