ఆ ఒక్క ఫొటోతో.. చిన్న‌నాటి హ‌రికృష్ణ గొప్ప‌ద‌నాన్ని చాటిన క్రిష్‌

ఎన్టీఆర్ చిత్ర ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి హ‌రికృష్ణ మ‌ర‌ణంపై దిగ్బ్రంతి వ్య‌క్తం చేశారు. తండ్రికి త‌గిన త‌న‌యుడని, చిన్న వ‌య‌సులోనే తండ్రి ముందు న‌డిచిన మంచి మ‌న‌సు ఆయ‌న‌ద‌ని అభివ‌ర్ణించారు క్రిష్. 1962లో ఎన్టీఆర్ నేష‌న‌ల్ డిఫెన్స్ ఫండ్ క‌లెక్ష‌న్ లో నంద‌మూరి తార‌క‌రామారావుతో అడుగులు వేస్తున్న చిన్ని హ‌రికృష్ణ ఫొటో ను ట్వీట్ చేశారు క్రిష్. మార్పుకోసం రామ రధ చక్రాలు నడిపిన చైతన్యరధసారధ్యం, చిన్ననాటే జనం కోసం తండ్రి ముందు నడచిన వారసత్వం అంటూ హ‌రికృష్ణ చిన్న‌నాటి జ్ఞాప‌కాల‌ను అభిమానుల‌ముందుంచారు క్రిష్.